గత రాత్రి తిరపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
బుధవారం రాత్రి వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం టిక్కెట్లు జారీ చేస్తున్నారని తెలిసి ఒకేసారి వేల సంఖ్యలో భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. పలువురు ఆస్పత్రిలో ఇప్పుడు కూడా చికిత్స పొందుతుండగా మరికొందని డిశ్చార్జి చేశారు. తాజాగా తిరుపతి ఘటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తిరుపతి ఘటన చాలా బాధకరమని, దీనికి గల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.