పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ జోరు, రెండో స్థానంలో బీజేపీ

-

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటుతోంది. సాయంత్రం ట్రెండ్స్ ప్రకారం 63,229 గ్రామ పంచాయతీలకు గాను టీఎంసీ 18,332 పంచాయతీల్లో, బీజేపీ 4,592, కాంగ్రెస్ 1,142, సీపీఐ(ఎం) 1,894 పంచాయతీల్లో గెలుపు లేదా ముందంజలో కొనసాగుతున్నాయి. పంచాయతీ సమితిల విషయానికి వస్తే టీఎంసీ 134, బీజేపీ 8, సీపీఎం 6 స్థానాల్లో, జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 22, సీపీఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. 63వేలకు పైగా గ్రామపంచాయతీలకు గాను 28వేల పంచాయతీల సమాచారం మాత్రమే ప్రస్తుతం వెల్లడైంది. మరో 35వేలకు పైగా గ్రామపంచాయతీల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే సరికి మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాలెట్లను లెక్కించడానికి.. ఫలితాలను కంపైల్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోందని అధికారులు వివరించారు.
ఇకపోతే జులై 8న పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రోజున పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాదాపు 15 మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కౌంటింగ్ రోజు కూడా దుండగులు రెచ్చిపోయారు. డైమండ్ హార్బర్‌లోని పోలింగ్ కేంద్రంపై దుండగులు బాంబులు విసిరారు. ఆ సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. హావ్‌డాలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని దుండగులు చుట్టుమట్టారు. చివరికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version