తెలంగాణలో చాలా ప్రాంతాలకు నేటికీ రవాణా సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కొందరు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లేందుకు సంప్రదాయ పద్ధతులతో పాటు రిస్క్ చేయాల్సి వస్తోంది. వంతెన సదుపాయాలు లేకపోవడంతో వాగు దాటేందుకు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ ఘటన నిర్మల్-కుంటాల పరిధి కల్లూరు-పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య తరచూ వెలుగుచూస్తోంది.
ప్రభుత్వాలు మారుతున్నా ప్రజాప్రతినిధులు అసలే పట్టించుకోకపోవడంతో సుద్దవాగుపై ఉన్న వంతెన నిర్మాణానికి నోచుకోవడం లేదు. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఈ కూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇరుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.వాగుకు అవతలి వైపు ఉన్న తమ పొలాల వద్దకు వెళ్లేందుకు ప్రస్తుతం ఇనుప పైపే వారికి బ్రిడ్జిగా మారిందని రైతులు వాపోతున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా వాగులో కొట్టుకుపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాగు దాటడానికి పైప్నే బ్రిడ్జిగా వాడుతున్న గ్రామస్థులు
నిర్మల్ – కుంటాల పరిధి కల్లూరు-పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది.
దీంతో రాకపోకలు నిలిచిపోయి స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాగుకు అవతలి వైపు ఉన్న తమ పొలాల… pic.twitter.com/z1uO1i7DCB
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024