ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

-

మే 7 న ఏ రాశుల వారికి అదృష్టం బావుంది అనే విషయాలను గురించి తెలుసుకుందాం..

మేషరాశి : కొంత కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ఆర్తికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. వస్త్రలాభాలు అధికంగా ఉంటాయి.. ఈరోజు ఏది చేసిన బాగా కలిసి వస్తుంది.

వృషభరాశి : ఆర్థిక విషయాలలో కొంచెం ఇబ్బంది.ఈరోజు అనుకున్న పనులు పూర్తి కావు..ఇంటా, బయట చికాకులు ఏర్పడుతాయి. రుణాల కోసం ప్రయత్నం చేస్తారు.వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. పని భారం పెరుగుతుంది. అన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉండవు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం మంచిది.

మిథున రాశి : కుటుంబంలో చికాకులు వస్తాయి కానీ మీరు తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. అనుకోని శుభవార్తలు వింటారు. ఆదృష్టం మీ వెంటే ఉంటుంది. అనుకూలమైన రోజు. ఆరోగ్యం. ఆర్థికంగా మంచి ఫలితాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయడం మంచిది.

కర్కాటక రాశి : కొంచెం శ్రమతో కూడిన రోజు. ఆర్థిక విషయాలలో అనుకున్నంత ప్రోత్సహాకరంగా ఉండదు. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి..చిన్న చికాకులు..ఘర్షణలు.. శ్రీ రామ తారకాన్ని 108 సార్లు పారాయణ చేయండి.

సింహరాశి : మంచి రోజు, ఆటంకాలు పోతాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ముందుకుపోతారు. మనఃశాంతి. ప్రశాంత వాతావరణం. ఆన్ని రకాలుగా బాగుంటుంది. గోసేవ చేయడం చాలా మంచిది.

కన్యారాశి : మీరు చాలాకాలంగా ఎదరుచూస్తున్న శుభ వార్తలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయం వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు స్వర్ణలాభాలు. ప్రయాణ సూచన. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరాధన చేయండి. అంతా మంచి జరుగుతుంది.

తులారాశి : మిశ్రమంగా ఉంటుంది. ఆప్పుల కోసం ప్రయత్నం. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. విందులు, వినోదాలు. మహిలలకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీ విష్ణు ఆరాధనను పారాయణం చేయడం మంచిది.

వృశ్చిక రాశి : అన్నింటా చాలా మంచి రోజు. కుటుంబంలో శుభకార్య తలంపు. రియల్, షేర్ మార్కెట్‌లో లాభాలు వస్తాయి. అప్పుల బాధ తొలగిపోతుంది. విలువైన వస్తువులు కొంటారు. సానుకూలమైన రోజు. ఆంజనేయాస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి : పెద్దల ద్వారా మంచి వార్తలు వింటారు. ఆస్తి సమస్యలు పరిష్కారం. కుటుంబంలో చికాకులు తగ్గుతాయి. వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిన రోజు. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతాయి. హనుమాన్ చాలీసాను మూడుపూటలా పారాయణం చేయండి.ఈరోజు కొంతవరకూ మంచి జరుగుతుంది.

మకర రాశి : కొంచెం శుభం, కొంచెం నష్టం. ప్రయాణ చికాకులు. ఆర్థిక స్థితి సరిగ్గా ఉండదు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంలో సఖ్యత, సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి..ఈరోజు ఏది చేసిన మిస్రమ ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి : చక్కటి శుభ పలితాలు వస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం. ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మంచి వార్తలు వింటారు. శ్రీ వేంకటేశ్వరాస్వామి ఆరాధన చేయండి..ఈ రాశి వారికి మంచి రోజు..

మీనరాశి: దూర ప్రయాణాలకు అవకాశం. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. వస్త్రలాభాలు. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి..అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version