నేడు మ‌ణిపూర్‌లో రెండో విడ‌త పోలింగ్

-

ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు తుది ద‌శకు చేరుకున్నాయి. ఇప్ప‌టికే గోవా, పంజాబ్, ఉత్త‌ర ఖాండ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 6 విడతల పోలింగ్ జరిగింది. చివ‌రిదైన 7 విడత పోలింగ్ ఈ నెల 7 న జ‌ర‌గ‌నుంది. అలాగే మ‌ణిపూర్ కు ఇప్ప‌టికే ఒక విడత పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 28 వ తేదీన‌ జ‌రిగింది. నేడు రెండో విడత పోలింగ్ జ‌రుగుతుంది. మ‌ణిపూర్ లో ఈ రోజు ఉద‌యం 7 గంట‌లకే పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 22 అసెంబ్లీ స్థానాల‌కు 1,247 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జ‌రుగుతుంది.

ఇందులో 223 పోలింగ్ కేంద్రాలు పూర్తిగా మ‌హిళ‌ల‌తో నిర్వ‌హిస్తున్నారు. అలాగే ఈ విడత‌లో మాజీ ముఖ్య‌మంత్రి ఓక్రం ఇబోబిసింగ్ తోపాటు ఆయ‌న కుమారుడు సూర‌జ్ కుమార్ వంటి ప్ర‌ముఖులు పోటీలో ఉన్నారు. కాగ మ‌ణిపూర్ లో ఫిబ్ర‌వ‌రి 28 వ తేదీని జ‌రిగిన తొలి ద‌శ పోలింగ్ లో 12 పోలింగ్ స్టేషన్ల‌ల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా 12 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఈ రీపోలింగ్ కూడా నేడు రెండు విడత‌లో జ‌రుగుతున్నాయి. కాగ మ‌ళ్లీ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version