నేడు మోకిల పీఎస్‌కు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

-

జన్వాడ ఫాంహౌస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాజ్ పాకాల తన అడ్వొకేట్‌తో కలిసి మధ్యాహ్నం 12 గంటకు మోకిల పీఎస్‌ కు వెళ్లనున్నారు. ఇప్పటికే రాజ్‌పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

దీంతో ఆయన్ను పోలీసులు ప్రత్యేకంగా విచారించనున్నారు. ఇదే కేసులో మరో కీలక నిందితుడైన విజయ్ మద్దూరి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో గత రాత్రి ఆయన ఇంట్లో పోలీసుల తనిఖీలు చేశారు. ఫాంహౌస్‌లొ పార్టీ జరిగిన సమయంలో విజయ్ మద్దూరికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో ఆయనకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే విషయంలో ఆయన ఫోన్ సంభాషణ కిలకంగా మారింది. అందుకే ఆ ఫోన్ కోసం పోలీసులు సోదాలు జరిపారు. కానీ, విజయ్ మద్దూరి పోలీసులకు ఇంకా చిక్కలేదు. పార్టీ జరిగిన రోజు తన ఫోన్ బదులుగా వేరే మహిళ ఫోన్‌ను విజయ్ పోలీసులకు ఇచ్చినట్లు తెలిసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version