సైబర్ క్రైమ్.. రైల్వేఉద్యోగికి చెందిన రూ.72 లక్షలు స్వాహా!

-

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రతీసారి కొత్త పంథాను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ రైల్వే ఉద్యోగిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.72 లక్షలను కాజేశారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని ఫోన్ చేసిన కేటుగాళ్లు ఓ బాంబు బ్లాస్ట్ కేసులో మీ పేరు ఉందని రైల్వే ఉద్యోగిని బెదిరించారు.

నిన్ను ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తమకు డబ్బు పంపాలని బెదిరించారు. ఇలా బాధితుడి నుంచి రూ.72 లక్షలు కాజేశారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన సదరు ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. ఇదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఓ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయని నమ్మించి రూ.16.6 లక్షలు దోచుకున్నారు. దీంతో ఇల్లందు మండలానికి చెందిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version