31 రోజులుగా తగ్గని పెట్రోల్ రేట్.. ఇవాళ ఎంతో తెలుసా?

-

న్యూఢిల్లీ: గత 31 రోజులుగా ఆయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్‌లో మాత్రం పెట్రోల్ లీటర్ రూ.100కు చేరుకుంది. ఇక్కడ ఇదే రికార్డు స్థాయి ధరకావడం విశేషం. 31 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై 8.06 పెరిగగా డీజిల్ రూ. 8.37 పెరిగింది. ఇవాళ ఆయిల్ ధరలు నిలకడగా ఉన్నాయి.

పెట్రోల్-డీజిల్

ఆదివారంతో పోల్చితే సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 102.32గా ఉంది. జైపూర్‌లో రికార్డు స్థాయిలో పెట్రోల్ ధర రూ. 105.18గా పలుకుతోంది. ముంబైలోనూ పెట్రోల్ ధర అత్యధికంగా పలుకుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.56గా విక్రయాలు జరుగుతున్నాయి. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.75గా ఉంది.

ఇక డీజిల్ రేటు విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ రేటు రూ. 96.90గా ఉంది. అత్యధికంగా జైపూర్‌లోనే డీజిల్ రేటు ఉంది. జైపూర్‌లో ఈ రోజు లీటర్ డీజిల్ ధర రూ. 97.99గా ఉంది.

వివిధ నగరాల్లో పెట్రోల, డీజిల్ ధరలు:

Read more RELATED
Recommended to you

Exit mobile version