దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న… ఒమి క్రాన్ వేరియంట్… ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్.. 70 దేశాలకు పైగా పా కేసింది. ఇక ఇటు ఇండియా లోనూ… ఈ కొత్త వేరియంట్… అందరికీ టెన్షన్ పుట్టిస్తోంది. అయితే తాజాగా.. హైదరాబాద్ మహానగరం పై దీని ఎఫెక్ట్ పడింది. ఒమిక్రాన్ వేరియంట్ తో టోలీచౌకీ పారామౌంట్ కాలనీ ఉలిక్కిపడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది.
ఇందులో బాగంగానే 25 హెల్త్ టీమ్స్ టోలిచౌకీ ప్రాంతంలో రంగంలోకి దిగాయి. 700 ఇళ్లలో టెస్ట్‌లు, ఇప్పటి వరకు 136 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు వైద్య అధికారులు. 36 గంటల తర్వాత ఈ పరీక్ష ఫలితాలు రానున్నాయి. ఒకవేళ కరోనా పాజిటివ్‌గా వస్తే జీనోమ్ సీక్వెన్స్‌కి శాంపిల్స్ పంపనున్నారు అధికారులు. ఈ తరణంలోనే టోలిచౌకి లోని పారామౌంట్ కాలనీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. టోలిచౌకి లోని పారామౌంట్ కాలనీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించడం తో.. హైదరాబాద్ వాసుల్లో టెన్షన్ మొదలైంది.