ఇక టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ క‌మెడియ‌న్ అత‌డేనా..!

-

టాలీవుడ్‌లో ఇంత‌కు ముందు క‌మెడియ‌న్లు చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు సినిమాల్లో ఎక్కువ కామెడీ ట్రాకులు పెట్ట‌క‌పోవ‌డంతో వారి ప్ర‌భావం త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు టాప్ కామెడియ‌న్ల లిస్ట్‌లో బ్ర‌హ్మానందం, వేణు మాధ‌వ్, సునీల్ లాంటి వాళ్లు ఉండేవారు. ప్ర‌స్తుతం వీళ్ల జోష్ ఏ మాత్రం లేక‌పోవ‌డంతో.. టాలీవుడ్‌లో స్టార్ క‌మెడియ‌న్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే అది వ‌న్ అండ్ ఓన్లీ వెన్నెల కిషోర్ అని చెప్ప‌వ‌చ్చు.


ఈ మ‌ధ్య వ‌చ్చిన సినిమాల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను త‌న కామెడీతో ఆక‌ట్టుకుంటున్నాడు. వాస్త‌వానికి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఉండాల్సిన వెన్నెల కిషోర్ క‌మెడియ‌న్‌గా మారాడు. సాఫ్ట్‌వేర్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో వెన్నెల సినిమా దర్శకుడు దేవ కట్టా దగ్గర సహాయకుడిగా పనిచేయడానికి వెళ్ళాడు.

ఆ చిత్రంలో శివారెడ్డి బ‌దులుగా ఆ పాత్ర‌లో న‌టించిన‌ కిషోర్ త‌న మొద‌టి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఈ త‌ర్వాత మూడేళ్లు గ్యాప్ తిసుకున్న వెన్నెల కిషోర్ తిరిగి అవ‌కాశాలు రావ‌డంతో కామెడియ‌న్‌గా మారిపోయాడు. చిన్న చిన్న సినిమాల‌తో కెరీర్ ప్రారంభించిన వెన్నెల కిషోర్ ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కూడా న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచుతున్నాడు.

ఇక తాజాగా మ‌న్మ‌థుడు 2 చిత్రంలో న‌టించి ప్ర‌శంస‌లు పొందారు. అలాగే యంగ్ రెబ‌ల్ స్టార్ సాహో చిత్రంలో కూడా వెన్నెల కిషోర్‌కు అవ‌కాశం ద‌క్క‌డం ఆశ్చ‌ర్యం. అలాగే ఎటువంటి పాత్రకైనా నప్పే వెన్నెల కిషోర్ మేనరిజం ఆయనకు మ‌రిన్ని అవకాశాలు తెచ్చి పెడుతున్నాయి. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌న్ అండ్ ఓన్లీ స్టార్ క‌మెడియ‌న్‌గా వెన్నెల కిషోర్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version