తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్ !

-

‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ.. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇక ఆ తర్వాత వరుసగా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. అయితే రాహుల్ రామకృష్ణ ఇటీవల తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ లిప్ లాక్ ఇస్తున్న ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే.

కానీ ఇప్పటివరకు పెళ్లి తేదీ కానీ, పెళ్లి జరిగినట్లు కానీ ఎక్కడ సమాచారం ఇవ్వలేదు. కానీ తాజాగా ఓ షాకింగ్ వార్తని చెప్పాడు రాహుల్ రామకృష్ణ. తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. మా లిటిల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పండి అంటూ తన భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మీకు పెళ్లి ఎప్పుడు అయింది అని చాలామంది కామెంట్ చేయగా.. కంగ్రాట్స్ అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version