ఆ కారణం వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా..సింగర్ కల్పన సంచలన వీడియో.. !

-

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్ కల్పన కీలక ప్రకటన చేశారు. తన ఆరోగ్యం, సూసైడ్‌ విషయాలపై స్పందించారు. స్ట్రెస్ వల్లే నేను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నానని ప్రకటించారు సింగర్ కల్పన. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవన్నారు. నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా భర్త , కూతురు అంటూ క్లారిటీ ఇచ్చారు సింగర్ కల్పన.

 

Tollywood star singer Kalpana made a key announcement

నా మీద జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించారు. రైట్ టైంలో ఆయన పోలీసులని అలర్ట్ చేసారు కాబట్టే నేను బతికాను అన్నారు సింగర్ కల్పన. ఇది ఇలా ఉండగా.. రెండు రోజుల కిందట సింగర్ కల్పన ఇష్యూ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. స్లీపింగ్ టాబ్లెట్లు మింగి.. నిద్రలోకి వెళ్లిన సింగర్ కల్పన ను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. ఆమె కోలుకున్న తర్వాత.. తాజాగా ఈ వీడియో పెట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news