అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అంతేకాదు తనకు పుట్టబోయే బిడ్డకు స్వాగతం చెబుతూ భార్యతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
” బేబీ మూన్.. మా చేతుల్లోకి నిన్ను తీసుకోవడానికి చాలా ఆత్రుతగా వేచి చూస్తున్నాం. మేము తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొత్త అధ్యాయం, కొత్త జీవితం, కొత్త ప్రయాణం. తండ్రిని కాబోతున్నాను. ఓర్మ ఐ లవ్ యు. హ్యాపీ వాలెంటైన్స్ డే” అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతేడాది నవీన్ చంద్ర తన భార్య ఓర్మాను అభిమానులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు నవీన్ దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.