బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంట్లో నిన్న రాత్రి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లు రహస్యంగా సమావేశమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశ రాజధాని చుట్టుపక్కల నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ముందస్తు చర్చలు జరపాలని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరించారన్న సంగతి తెలిసిందే. గత వారం ప్రారంభమైన వేలాది మంది రైతుల నిరసనలపై ప్రభుత్వం చర్చలు జరిపింది.
ఢిల్లీ లోకి ప్రజలు వచ్చే ఐదు ఎంట్రీ పాయింట్లను అడ్డుకుంటామని నిరసనకారులు బెదిరించడంతో ఈ సమావేశం అర్ధరాత్రి రెండు గంటలకు పైగా కొనసాగిందని అంటున్నారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనల నేపధ్యంలో, అమిత్ షా మాట్లాడుతూ ప్రతి సమస్యకు ఒక డిమాండ్ ఉంటుందని దానిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే, రైతులు ప్రభుత్వంతో ముందస్తు చర్చలు జరపాలని కోరుకుంటే నిరసన కోసం నిర్దేశించిన వేదికకు మార్చాల్సి ఉంటుందని హోంమంత్రి చెప్పారు; చర్చలు డిసెంబర్ 3 న జరగనున్నాయని చెబుతున్నారు.