బిగ్‌ బ్రేకింగ్: భద్రతా బలగాలు ట్రాప్‌లో హిడ్మా‌..?

-

మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మాను భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా పట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి నక్సల్స్‌ను ఏరివేసేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హిడ్మాను భద్రతా దళాలు చుట్టుముట్టాయని, అతడిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, ఈ ఎదురుకాల్పుల్లో ఇరువైపులా భీకర పోరాటం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, హిడ్మా పట్టుబడ్డాడా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news