టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో ఒక మార్పు చేశారు. మహీశ్ తీక్షణ స్థానంలో ఫజల్ హక్ ఫారూఖీని తీసుకున్నారు. గత మూడు మ్యాచ్ లలో ఆర్సీబీ జట్టు టాస్ తో పాటు మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఇవాళ కూడా టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

 

రాజస్థాన్ రాయల్స్ :

యశస్వి జైస్వాల్, శుభమ్ దూబె, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్ మేయర్, వానిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, ఫజల్ హక్ ఫారూకీ, తుసార్ దేశ్ పాండే, సందీప్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దేవ్ దత్ పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్, హెజిల్ వుడ్, యశ్ దయాల్.

 

Read more RELATED
Recommended to you

Latest news