టూరిస్టులను కూర్చోబెట్టి కాల్చివేత.. టెర్రరిస్టుల దాడి వీడియో వైరల్

-

జమ్ముకాశ్మీర్‌లోని టూరిస్టు స్పాట్ పహెల్గాం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే, నిందితులను వెంటనే కాల్చివేయాలని అప్పుడే మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని దేశప్రజలు కోరుతున్నారు. గతంతో మాదిరి కేంద్రం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలాఉండగా, పహల్గామ్‌లో టెర్రరిస్టుల దాడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టూరిస్టులను మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్పులు ఉగ్రవాదులు జరిపినట్లు అందులో స్పష్టం అవుతోంది. హమాస్ తరహాలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. కాల్పుల శబ్దాలు విని కొందరు టూరిస్టులు పరుగులు తీస్తున్న వీడియోలో రికార్డు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news