జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు దాడి చేయడంతో 28 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో భారత్ కి ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య చివరగా 2012-13 లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ఐసీసీ టోర్నీలో మాత్రమే భారత్ -పాక్ తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్ లో ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించవద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు.