నల్లగొండ జిల్లాలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నల్లమల అటవీప్రాంతమైన చందంపేట మండలం చింత్రియాల సమీపంలోని 9 గ్రామాల్లో గాలిలో విషవాయువులు ఉన్నాయని ఒక సర్వేలో గుర్తించినట్టుగా తెలుస్తుంది. యురేనియం నిల్వలున్న ఆ ప్రాంతాల్లో పరిమితికి మించి థోరాన్, రేడాన్ వాయువులు వెలువడుతున్నట్టు ఓయూ సీబీఐటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నిపుణుల పరిశోధనలో వెల్లడి అయింది.
ప్రఖ్యాత సైన్స్ నేచర్ జర్నల్ లో మార్చి18న ప్రచురితంకావడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. నిర్ణీత ప్రమాణాల కంటే 12 రెట్లు అధికంగా థోరాన్ ఉండడంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో వాళ్ళు పేర్కొన్నారు. భయాందోళనలో ఉన్న స్థానికులు తమను రక్షించాలని కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చినట్టు సమాచారం.