సిగిరెట్ పీకలతో బొమ్మలు, కుషన్లు..అంతా పర్యావరణ పరిరక్షణ కోసమే..!

-

పొగతాగటం ఆరోగ్యానికి మంచిది కాదని…తాగే ప్రతిఒక్కరికి తెలుసు..అయినా ఎవరూ పట్టించుకోరు. ఏం చేస్తాం టెన్షన్స్ అలా ఉంటాయ్ మరి వాళ్లకు. ఎప్పుడో స్టైల్ కోసమే, స్ట్రస్ రిలీఫ్ కోసమే తాగిన సిగిరెట్..మీరు వదిలేద్దాం అనుకున్నా అది మిమ్మల్ని వదలదు.దాని వల్ల లంగ్ క్యాన్సర్ భారినపడి జీవితాలను కోల్పోయినవారు ఎందరో ఉన్నరు. ఇప్పుడు ఈ మోటివేషన్ స్పీచ్ కాదులే..మీరు తాగేసిన తర్వాత పడేస్తారు కదా..సిగిరెట్ పీకలు వాటి గురించి మన టాపిక్.

జనరల్ గా అందరూ సిగిరెట్ పీకలను డస్టబిన్స్ లోనో…రోడ్డుపక్కనో వేస్తుంటారు. అసలు ఈ సిగిరెట్లు, వాటిపొగ కన్నా ఈ సిగిరెట్ పీకలతోనే పర్యారణానికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అందుకోసమే ఈ ప్రమాదకర సిగిరెట్ పీకలను ఓ స్టార్టప్ సంస్థ పునర్వియోగిస్తూ పర్యావరణానికి కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ సంస్థ ఏంటి..ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

సిగరెట్ల వినియోగం, చెత్తబుట్టలకు చేరుతున్న సిగరెట్‌ పీకలు వంటి అంశాలపై నామన్‌.. విశాల్ అనే ఇద్దరు వ్యక్తులు‌ బాగా అధ్యయనం చేశారు. అనంతరం ‘కోడ్‌’ కంపెనీ స్థాపించి.. యంత్రాలను సమకూర్చుకున్నారు. అయితే, సిగరెట్‌ పీకలను ఎలా సేకరించాలనేదే వారికి పెద్ద సవాల్‌ గా మారింది. ఇందుకోసం కోడ్‌ సంస్థ వీధి వ్యాపారులు, చెత్త సేకరించేవాళ్లకు ‘వీబిన్స్‌’ పేరుతో డబ్బాలను అందించింది.

రోడ్ల పక్క దుకాణాలు, టీ స్టాల్స్‌, కార్యాలయాల్లోని చెత్తబుట్టల వద్ద వీటిని పెట్టి కేవలం సిగరెట్‌ పీకలను సేకరించాలని సూచించారు.. ఇలా సేకరించిన సిగరెట్‌ పీకలను ఈ సంస్థే కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేసేది. ఆ తర్వాత వాటిని శుభ్రం చేస్తే అందులోంచి వచ్చిన దూదితో బొమ్మలు, కుషన్లు తయారు చేస్తోంది.

పరిరక్షణ కోసమే..

నామన్‌.. విశాల్‌ వ్యాపారమే చేయాలి అనుకుంటే.. సాధారణ బొమ్మలు తయారు చేసి అమ్ముకోవచ్చు… కానీ, తమ వంతుగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే తపనతోనే ఈ మిత్రులు ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. నిజంగా ఇది అభినందించాల్సిన విషయం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో సిగరెట్‌ పీకలను సేకరిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు చెబుతున్నారు.

కావాలనే పర్యావరణాన్ని కలుషితం చేసే వ్యక్తులు ఉన్న ఈ ప్రపంచంలో..తమ వంతుగా..నేచర్ ని కాపాడాలనుకునేవారు చాలా అరుదు..ఇలాంటివారికి ప్రభుత్వం సాయం అందిస్తే వీరు ఇంకా ముందుకు వెళ్ల గలుగుతారుకదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version