అభిమానిగా విజయ్‌ సినిమాకు అదిరిపోయే పాటలిస్తా: థమన్

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి- కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘‘తలపతి66’’. ప్రజెంట్ తెలంగాణలోని హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ‘బీస్ట్’ తర్వాత విజయ్ ఈ సినిమా చేస్తున్నారు.

ఈ చిత్ర స్టోరి గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు చెప్తున్నారు మేకర్స్. అయితే, ఈ సినిమా తెలుగు దర్శకుడు, నిర్మాత దిల్ రాజు చేస్తున్నందున చాలా మంది తెలుగులో ప్రాధాన్యత ఉంటుందనుకుంటున్నారు. కానీ, తమిళ్ సినిమాగానే తెరకెక్కి తెలుగులోకి డబ్ అవుతుందని స్పష్టతనిచ్చారు మేకర్స్.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తు్న్న యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ తో పని చేయాలని తను చాలా కాలం నుంచి అనుకున్నానని, లక్కీగా ‘తలపతి 66’ కి కుదిరిందని చెప్పుకొచ్చారు.

ఈ పిక్చర్ లో 6 సాంగ్స్ తో పాటు ఒక బీట్ సాంగ్ ఉంటుందని తెలిపారు. అభిమానిగా విజయ్ కి చక్కటి పాటలు ఇస్తానని అన్నారు. భారీ తారగణంతో హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ఇటీవల తాను వెళ్లి చూశానని వివరించారు థమన్. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక విజయ్ సాంగ్స్ లో తన ఫేవరెట్.. ‘వాతి కమింగ్, అరబిక్ కుతు’ అని తెలిపారు థమన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version