కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ క్లాస్ పీకినట్లు తెలుస్తున్నది.గత ప్రభుత్వం కంటే సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ రావడంలేదు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు.
నేతలు, కార్యకర్తలు అలకవీడి పార్టీకోసం పనిచేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇకపై కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అన్ని పథకాలు అమలు చేసినా, ఆరుగ్యారెంటీలు అమలవుతున్నా ప్రభుత్వానికి మైలేజ్ రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకు కాంగ్రెస్ నేతలు, కేడర్ కారణమని టీపీపీసీ చీఫ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.