ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతోన్న మహాకుంభమేళాకు భక్తులు అంచనాలకు మించి పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నేటి వరకు 50 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా కొనసాగనుండగా ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉంది.
కాగా, కుంభమేళాకు రూ.1500 కోట్లు ఖర్చు పెడితే… 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు సీఎం యోగి. తాజాగా మహా కుంభమేళాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మహా కుంభమేళాకి రూ.1500 కోట్లు ఖర్చు పెడితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్. ఇలాంటి కార్యక్రమం విజయ వంతం కావడం గర్వకారణమని చెప్పారు.