స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% సీట్లు గెలుచుకుంటాం.. గెలిచి తీరుతాం అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన కవితను ఏమోహం పెట్టుకుని వచ్చావని అడగాల్సి ఉండే. కవిత ఆర్థిక స్థితిగతులు 2014 కంటే ముందు ఏముండే.. ఇవాళ ఏ స్థాయికి పోయారు. ఎలా పోయారు.. ఎవరి సొత్తు దోచుకుని పోయారు. ప్రజల సొత్తు కాజేసివాళ్ళ ఆర్థిక స్థాయి పెంచుకున్నారు.
అలాంటి నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు. కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం.. కానీ అధికారం కట్టబెడితే ఏం చేశారు ..పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ళు దోచుకున్న డబ్బు తో సోషల్ మీడియా ను నడుపుతున్నారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి మేము ఏడాదిలో చేసి చూపించాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. కార్యకర్త లు నారాజు ను పక్కన పెట్టి పని చేయండి. 26న రైతు భరోసా ఇస్తున్నాం అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.