ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది : అక్బరుద్దీన్

-

ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది అని MIM ఎంఎల్ఏ అక్బరుద్దీన్ అన్నారు. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 301 కోట్లతో శివరేజ్ పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు.వర్షం నీరు, మురుగు నీరు కలవకుండా వేర్వేరు లైన్ ఏర్పాటు చేయడం సంతోషం. మురుగు నీరును కూడా బాగు చేయడానికి ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దానితో మూసి లో మురుగు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వం ఓల్డ్ సిటీ ని ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తామని అన్నారు. కానీ చార్మినార్ పేడేస్ట్రియన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఓల్డ్ సిటీ కి ప్రతి రోజు వేల సంఖ్యలో టూరిస్ట్ లు వస్తారు.

ఓల్డ్ సిటీ లో మరింత డెవలప్ చేస్తే.. టూరిజం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తేస్సుకొస్తామన్న టూరిజం పాలసీలో మక్కా మసీదు తో పాటు ఇతర మసీదు లను కూడా చేర్చితే భగుంటుంది. ఓల్డ్ సిటీ లో కూడా హై రైజ్డ్ అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది. ఓల్డ్ సిటీలో బస్టాండ్లలో పాటు మినీ బస్సులను కూడా ఏర్పాటు చేయాలని సీఎం కోరుతున్నాను.. కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి పై ప్రభుత్వం దృష్టిసారించి.. త్వరగా పూర్తి చేయాలి. సిటీ లో ఉన్న స్టేడియాలను పొలిటికల్ పార్టీ మీటింగ్లకు ఇవ్వకుండా.. స్పోర్ట్స్ ను పెంచే విధంగా ఉండాలి అని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version