రైతుల భయం.. గురుగ్రామ్ లో భారీ ట్రాఫిక్ జామ్..

-

ఢిల్లీలో ఆందోళన చేయడానికి వెళుతున్న రైతుల టెన్షన్ ఇప్పుడు పోలీసులని పట్టి కుదిపేస్తోంది. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన పంజాబ్‌ రైతులు నిన్న హర్యానా దాటి ఢిల్లీలో ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అడ్డుకున్న పోలీసులపై తిరబడటంతో… ఇవాళ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. మళ్లీ రైతులు ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేయొచ్చన్న అంచనాలతో రోడ్లకు అడ్డంగా ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు వేశారు.

అయితే ఎట్టకేలకు దేల్తిలో ఆందోళన చేసుకోవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే వారు పూర్తిగా పోలీసుల పర్యవేక్షణ లో దేశ రాజధాని నగరంలోకి ప్రవేశించాలని పోలీసులు చెబుతున్నారు.  రైతులు క్రమపద్ధతిలో ఢిల్లీ పౌరులకు ఇబ్బంది లేని విధంగా సహకరించాలని కోరారు. నిరసన అదుపు తప్పితే భాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ఉపయోగిస్తామని రైతులు నిరసన తెలపడానికి బురారీలోని “నిరంకారీ సమాగమం గ్రౌండ్‌”ను సిద్ధం చేశామని చెబుతున్నారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ చెకింగ్ లు చేస్తుండడంతో గురుగ్రామ్ వద్ద భారీ ట్రాఫిక్ జాం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version