Breaking : విశాఖ ప్రజలకు అలర్ట్‌.. నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

-

తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ నగరంలో ఇప్పుడు దేశంలో నౌకాదళ సేవల్ని గుర్తు చేసుకుంటూప్రతీ ఏటా నిర్వహించే నేవీ డే నిర్వహణకు రంగం సిద్ధమైంది. దేశ భద్రతలో కీలకంగా ఉన్న నౌకాదళ సేవల్ని ప్రతీ ఏటా ఉత్సవంగా నిర్వహించుకుని గుర్తుచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా నౌకాదళ దినోత్సవం (నేవీ డే) అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేవీ డే-2022 సందర్భంగా విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 4న రామకృష్ణ బీచ్ రోడ్ లో NTR విగ్రహం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ యుద్ధ విన్యాసాలు జరుపుతున్న కారణంగా ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి, మరికొందరు ప్రముఖులు విశాఖ నగరానికి రానున్నారు. పలువురు ప్రముఖుల పర్యటన, నేవీ డే యుద్ధ విన్యాసాల సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 4న) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విశాఖ నగర పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను తెలుసుకుని అధికారులకు సహకరించాలని పోలీసులు కోరారు.

డిసెంబర్ 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా పాస్ కలిగి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. పాస్ లేని వాహనాలు ఫ్లైఓవర్ క్రింది నుంచి మాత్రమే అనుమతి ఇచ్చారు. వేమన మందిరం జంక్షన్, టైకూన్ జంక్షన్, సిరిపురం, సి.ఆర్ రెడ్డి సర్కిల్ మీదుగా APIIC గ్రౌండ్స్, AU హై స్కూల్, AU కాన్వకేషన్ హాల్ వద్ద వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు.

నావెల్ కోస్టల్ బ్యాటరీ వైపు నుంచి ఆర్ కే బీచ్ వైపు పాస్ కలిగి ఉన్న వాహనాలను మాత్రమే ఎన్టీఆర్ విగ్రహం మీదుగా APIIC గ్రౌండ్స్, AU హై స్కూల్, AU కాన్వకేషన్ హాల్ వద్ద వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు పెట్టాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version