సామాన్యుడికి నడిరోడ్డుపై సీపీఆర్ చేసి బేగంపేట ట్రాఫిక్ పోలీసులు అతని ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ పీఎన్టీ జంక్షన్ వద్ద రోడ్ క్రాస్ చేస్తూ పాదాచారుడు సురేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించి ట్రాఫిక్ పోలీసులు వెంటనే అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారు.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన సురేష్‌కు ట్రాఫిక్ పోలీసులు వెంటనే సీపీఆర్ చేయగా.. సురేశ్ స్పృహలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన్ను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి ఊపిరి పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఆనంద్,హైదర్‌లను సీఐ సమ్మయ్య అభినందించినట్లు తెలిసింది.