ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిరోజూ బెట్టింగ్ యాప్స్ వలన జరుగుతున్న అనార్థాలపై ప్రజలకు, నేటి యువతరానికి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఆయన పోస్టుల ద్వారానే ఇన్ ఫ్లూయెన్సర్లు భయ్యా సన్నీయాదవ్, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్ ల మీద పోలీసులు కేసులు పెట్టారు.
మొన్నటివరకు బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించిన హర్షసాయి సజ్జనార్ దెబ్బకు దిగొచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో అనూహ్య పోస్టు పెట్టాడు. ‘ఎవరూ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయవద్దని, బెట్టింగ్ మూలాలపై పోరాడదామని.. మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయబోనని’ హర్ష సాయి రాసుకొచ్చారు.కాగా, గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సైబరాబాద్ పోలీసులు అతనిపై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.