27 మంది పోలీసులకు షాక్ ఇచ్చిన బందర్ ట్రాఫిక్ పోలీసులు

-

విజయవాడ: ట్రాఫిక్ రూల్స్ ప్రజలకే కాదు.. పోలీసులకు కూడా వర్తిస్తాయని బందరు ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. రోడ్డు సేఫ్టీపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించినా కొందరు పోలీసులు ఉల్లంఘిస్తుండటంతో ప్రభుత్వ ఆశయం అభాసుపాలవుతోంది. ఇందుకు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న పోలీసులే కారణం. మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కొరడా ఝులిపించారు.

అయితే 27 మంది పోలీసులే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం ఆశ్చర్యం కలుగుతోంది. ప్రజారోగ్య భద్రతపై అవగాహన కల్పించాల్సిన పోలీసులు రోడ్డు రూల్స్ పాటించకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ డీఎస్పీ భరత్ మాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 27 మంది పోలీసులకు జరిమానా విధించారు. ప్రధాన కూడళ్లలో కాపు కాసి మరీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించారు. ఫొటోలు తీసి ఆన్ లైన్ ద్వారా జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులతో పాటు 100 మంది వాహనదారులకు జరిమానాలు పంపారు. దీంతో ఎస్ప భరత్ మాతాజీని ఉన్నతాధికారులు అభినందించారు. చట్టానికి ఎవరూ అతీతులుకారని నిరూపించినందుకు ప్రశ్నంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version