ఖమ్మంలో తీవ్రవిషాదం.. పొలంలో వ్యవసాయ కూలీ ఆత్మహత్య

-

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలం కిందట పొరుగు రాష్ట్రం నుంచి జిల్లాకు వలసొచ్చిన ఓ వ్యవసాయ కూలీ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కూసుమంచి మండలంలోని కిష్టాపురం-ముత్యాల గూడెం గ్రామాల మధ్య గల వ్యవసాయ భూమిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

స్థానికంగా ఉన్న మిర్చి తోటలో కూలీ పనిచేస్తున్న సదరు వ్యక్తి మహారాష్ట్ర నుంచి బతుకుదెరువు కోసం వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వ్యవసాయభూమిలో చెట్టుకు ఉరేసుకుని కనిపించగా మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.మృతదేహం లభ్యమైన సమీపంలోనే డేరాలు వేసుకుని కొందరు కూలీలు నివాసం ఉంటున్నారు.సదరు కూలీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news