రిలయన్స్ జియోకు షాక్.. 1.29 కోట్ల యూజర్లను కోల్పోయిన జియో

-

టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియోకు షాక్ తగిలింది. అనతికాలంలోనే మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కు షాకిస్తూ.. అనూహ్యంగా యూజర్లను పొందింది. కేవలం డాటాకు మాత్రమే డబ్బులు చెల్లించడి.. కాల్స్ ఫ్రీగా మాట్లాడండి అంటూ… టెలికాం బిజినెస్లోకి అడుగుపెట్టింది. దీంతో ఒక్కసారిగా టెలికాం యూజర్లు ఇతర నెట్ వర్క్ ల నుంచి జియోకు మారారు. అయితే ఇటీవల పలు సందర్భాల్లో జియో తన చందాదారులను కోల్పోతోంది. ఇదే సమయంలో భారతీ ఎయిర్ టెల్ యూజర్లు పెరుగుతున్నారు. తాజాగా ట్రాయ్ ప్రకటించిన గణాంకాల్లో కూడా డిసెంబర్ నెలలో జియో తన చందాదారులను కోల్పోయింది.

రిలయన్స్ జియో డిసెంబర్ నెలలో గణనీయంగా యూజర్లను కోల్పోయింది. నవంబర్ లో జియోకు యూజర్ల సంఖ్య 116.74 కోట్లు ఉండగా… డిసెంబర్ నాటికి 115.46 కోట్లకు చేరింది. దీంతో 1.29 యూజర్లను కోల్పోయింది. దీంతో జియో యూజర్ల సంఖ్య ప్రస్తుతం 41.57 కోట్లు ఉండగా… భారతీ ఎయిర్ టెల్  యూజర్ల సంఖ్య 4.75 లక్షల మందిని కోల్పోయి మొత్తం యూజర్ల సంఖ్య 35.57 కోట్లకు చేరింది. యూజర్ల కనెక్షన్ల సంఖ్యను తగ్గించుకోవడమే.. ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version