నంద్యాలలోని పులి పులి పిల్లలను ఆత్మకూరుకు తరలింపు

-

 

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం వద్ద లభించిన పులి పులి పిల్లలను ఆత్మకూరుకు తరలించారు అధికారులు. ఆత్మకూరు డి ఎఫ్ ఓ ఆఫీసులో పులి పిల్లలకు షెల్టర్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం అటవీ సిబ్బంది సంరక్షణలో పులి పిల్లలు ఉన్నాయి.

పెద్ద పులి వద్దకు పులి పిల్లలను చేర్చేందుకు ప్రయత్నిస్తున్న అటవీ సిబ్బంది.. ఈ మేరకు పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు పెద్ద గుమ్మడాపురం లో 40 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అటు పులి పిల్లలకు ఆహారం అందిస్తున్నారు అటవీ అధికారులు. పెద్ద పులి జాడ దొరకని పక్షంలో 4 పిల్లలను తిరుపతి జూకు తరలించే యోచనలో ఉన్నారు అటవీ అధికారులు. ఇక నేడు ఆత్మకూరు కు రానుంది తిరుపతి వన్య ప్రాణి సంరక్షణ ప్రత్యేక బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version