హైదరాబాద్ నగర పోలీస్ విభాగం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సోమవారం నుంచి ట్రాన్స్ జెండర్లు కూడా భాగస్వాములు కానున్నారు. తొలి దశలో భాగంగా మొత్తం 44 మంది ట్రాన్స్ జెండర్లు నగరంలోని వివిధ కూడళ్లలో వాహనాలను నియంత్రిస్తారు. నగర పోలీసులు దీనిని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు.
బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో ఎంపికైన ట్రాన్స్ జెండర్ల డ్రిల్ ను కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే మరింత మందిని విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.