వింత: ఈ వంట గదిని మాత్రం తాకితే అంతే సంగతులు…!

-

వంట గదిని శుభ్రంగా ఉంచుకునే వారు… వంట గదిని అందంగా సర్దుకునే వారిని చూసుంటాం. కాని వంట గదిని చాల పవిత్రంగా చూసుకునే వారు ఉంటారా..? మరి పవిత్రం అంటే ఇంత అంతా కాదండి.. ఏకంగా దానికి నిప్పు పెట్టేసే అంత. మరి ఇటువంటి వింత సంప్రదాయం గురించి చూడాలనుకుంటున్నారా..? మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి.

ఈ వింత సంప్రదాయం సునాబెడ శివారు ప్రాంతం, కొమన సమితి పరిధి తదితర చోట్ల సముద్ర మట్టానికి 36 వేల అడుగుల ఎత్తు లో 53 కుగ్రామాలు ఉన్నాయి. వీళ్ళు తమ వంట గదిని చాల పవిత్రంగా భావిస్తారు. వాళ్ళ వంట గదిని లాల్‌ బంగళా అనే పిలుస్తారు. ఒక వేళ పొరపాటున ఇతరులు వెళితే.. ఇంకేం ఉంది నిప్పు పెట్టేస్తారు. మళ్ళీ వేరేది నిర్మిస్తారు. ఇది వాళ్ళకి తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇంటికి కొంత దూరం లో వంట గదిని నిర్మిస్తారు. ఎర్ర మట్టి, కలపను నిర్మించడానికి ఉపయోగిస్తారు.

దేవతల తో పాటు వారి పితృదేవతలను పూజించడం వీరి ఆనవాయితీ. ఇంటికి కుమార్తె, అల్లుడు వస్తే వారి కోసం భోజనాన్ని ఆరుబయట వండి వడ్డిస్తారు. కుమార్తె వంట గది విషయం లోనూ ఆంక్షలు తప్పవు. ఆమె పొరపాటున వంట గది తాకినా నిప్పు పెట్టేస్తారు. వంట గది లో మాత్రం వంట చెయ్యరు. ఇదే వీరి వింత సాంప్రదాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version