ఆడా మగా బంధం ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఈ ట్రిక్స్ పాటించండి..

-

సృష్టి ముందుకు సాగాలంటే ఆడా, మగా కలవాల్సిందే. లేదంటే ఎప్పుడో ఒకరోజు సృష్టి అంతమైపోయేది. ఐతే ఆడ మగా కలవడానికి ఎన్ని కారణాలున్నా, వారిద్దరి మధ్య బంధం పటిష్టంగా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని ట్రిక్స్ ఇక్కడ తెలుసుకుందాం.

ఆడా, మగా అని చెప్పగానే గుర్తొచ్చేది భార్యా భర్తలే.

భార్యా భర్తల మధ్య సంబంధం సజావుగా ఎక్కువ కాలం పాటు ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

అది ప్రేమ పెళ్ళైనా, పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా కొన్ని రోజుల తర్వాత అన్నీ ఒకేలా మారిపోతాయి. ఈ రెండు పెళ్ళిళ్లలో కొన్ని రోజుల తర్వాత జరిగే సంఘటనలు ఒకేలా ఉంటాయి. ఐతే ముఖ్యంగా ఆడవాళ్ళు, ఒక ఇంటి నుండి మరో ఇంటికి వస్తారు కాబట్టి, అక్కడ వాళ్ళకి గౌరవం దక్కాలని కోరుకుంటారు. అది ఇవ్వలేని పక్షంలో వారి బాంధవ్యం ఎక్కువ రోజులు నిలబడదు. మెట్టినింటి దగ్గర ఆడవాళ్ళ గౌరవానికి ఇంతకుముందు విలువ ఇచ్చే వాళ్ళు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి వారికి గౌరవం దొరుకుతుంది. అలా దొరకలేని పక్షంలో భార్యభర్తల సంబంధాల్లో గొడవలు మొదలయ్యి, బంధం మధ్యలోనే తెగిపోయే అవకాశం ఉంది.

మీరు జాబ్ చేస్తూ, అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటున్నట్టయితే, ఆమెని గుర్తించండి. మీ పిల్లలకి కూడా ఆమె ప్రాముఖ్యం తెలిసేలా చేయండి. ఇంట్లో అందరి పనులూ చూసుకుంటూ, కావాల్సిన పన్లన్నీ చేస్తూ ఉండే అమ్మాయిలకి గుర్తింపు ఇవ్వాలి.

విషయం చిన్నదైనా సరే సంబరం జరుపుకోవాలి. దానివల్ల ఇద్దరి మధ్య బంధం మరింత పెరుగుతుంది.

బర్త్ డేలు, సర్ప్రైజ్ లు ఇస్తే మరీ బాగుంటుంది. మీ గురించి ప్రతీ విషయం చెప్పవద్దు. ప్రతీ ఒక్కరికీ పర్సనల్ స్పేస్ అంటూ ఉండాలి. ఆ స్పేస్ లో మీ ఒక్కరికే ప్లేస్ ఉండాలి. అలా అని ప్రతీ విషయాన్ని పర్సనల్ల్ స్పేస్ అని చెప్పి అందులో పడేయకూడదు. అప్పుడు ఏది పర్సనలో, ఏది ఇద్దరి విషయమో అర్థం కాక బంధం బీటలు వారే ప్రాబ్లమ్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version