విజయ్ దేవరకొండ సరసన త్రిప్తి దిమ్రీ…?

-

విజయ్ దేవరకొండ హీరోగా ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మూవీని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిచనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 2 సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ప్రస్తుతం  పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం లో నటిస్తున్నాడు.. మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version