ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 81.10 శాతం పోలింగ్‌ నమోదు

-

 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి 81.10 శాతం ఓటింగ్ నమోదైంది. మార్చి 2న కౌెంటింగ్ చేపట్టనున్నారు. త్రిపుర అసెంబ్లీకి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా 81.1శాతం పోలింగ్ నమోదైంది. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని అధికారులు తెలిపారు. వెంటనే వాటిని మార్చేసినట్లు స్పష్టం చేశారు.

ఓ నియోజకవర్గంలో సీపీఎం పోలింగ్ ఏజెంట్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు. త్రిపురలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కోసం 31 వేల మంది పోలింగ్‌ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు.

2024లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా జరిగిన త్రిపుర ఎన్నికలతో మినీ సార్వత్రికం ప్రారంభమైనట్లైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version