తెలుగు రాష్ట్రాలకు త్రివిక్రమ్ తన వంతు సాయం…!

-

కరోనా ను అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు, సినీ ప్రముఖులు తమవంతు విరాళాలను అందజేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా తన వంతు సహాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెంటికీ చెరో రూ.10 లక్షల విరాళం చొప్పున మొత్తంగా రూ.20 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముందుకి వచ్చారు.

కోటి రూపాయలు విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు. ఇదే క్రమంలో సినీ ప్రముఖులు పలువురు విరాళాలను అందజేసి ఉదారత ప్రభుత్వానికి తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. కరోనా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారత ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి 21 రోజులు దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది.

ఈ లాక్‌డౌన్ కారణంగా బీద బిక్కి ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలకు అక్కడి నేతలు, ప్రముఖులు తమవంతు సహాయాన్ని అందించడానికి పెద్ద మనసుతో ముందుకు వస్తున్నారు. సామాన్యులు కూడా ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి సహాయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version