గాడ్ ఫాదర్ టీజర్ పై దారుణంగా ట్రోలింగ్..మొత్తం కాపీనే అంటూ !

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్. ఈ టీజర్‌లో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఇది పక్కకు పెడితే.. గాడ్‌ ఫాదర్‌ టీజర్‌ పై దారుణంగా ట్రోలింగ్‌ మొదలు పెట్టారు నెటిజన్లు.

ఈ టీజర్‌ లో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అచ్చం మరో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన ఘనీ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ లాగా ఉందని ట్రోల్‌ చేస్తున్నారు. గాడ్‌ ఫాదర్‌ టీజర్‌, ఘనీ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ను ఒకే ఫ్రేమ్‌ లో పెట్టి మరీ.. చిరంజీవికి షాక్‌ ఇస్తున్నారు. చిరు బర్త్‌ డే సందర్భంగా ఇలా కావడంతో.. అటు చిరంజీవి ఫ్యాన్స్‌ కూడా అసంతృప్తితో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version