టీఆర్ఎస్ ప్లీనరీ అంతా సొల్లు కబుర్లు, సోది పురాణమే అని ఎద్దేవా చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్. చైనాకు దసోహం అనే జాతీయ రాజకీయాలు కావాల..? సర్జికల్ స్ట్రైక్ పై ఆధారాలు అడిగే జాతీయ రాజకీయాలు కావాలా..? అసలు మీ సిద్ధాంతం ఏమిటని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా మరో 20 ఏళ్ల వరకు జాతీయవాదం, ఆత్మనిర్భర భారత్ ప్రజల్లో నాటుకుపోయిందని ఆయన అన్నారు. మీరు స్వార్థపూరిత ఎజెండాతో, ప్రజల నుంచి మీ తప్పిదాలను, వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు జాతీయ రాజకీయాలు అంటున్నారని విమర్శించారు. ఈరోజు 4 లక్షల కోట్ల అప్పులు చేశారని… ఇలాగే దేశాన్ని అప్పులు ఊబిలో నెట్టడానికి జాతీయరాజకీయాల్లో వస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్లీనరీ అంతా సొల్లు కబుర్లు, సోది పురాణమే: లక్ష్మణ్, బీజేపీ నేత
-