దేశ రాజధాని ఢిల్లీలో తెరాస కార్యాలయం నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకుగాను ఢిల్లీ పర్యటనలో అనువైన స్థలాలపై ఫోకస్ పెట్టారు. దీంతో పార్టీ ప్రముఖులు ఎంపీలు ఢిల్లీలోని ప్రభుత్వ స్థలాలపై ఆరా తీస్తున్నారు. ఎంపీల వెంట ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఢిల్లీలో తెరాస పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి వెయ్యి గజాల స్థలం కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అందుకే స్థలాల పరిశీలనలో ఉన్నారు. అన్ని అనుకూలంగా సహకరిస్తే సంక్రాంతి పండగ తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. అలాగే రెండు మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ ఢిల్లీలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుని కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యహరించడం కోసం వ్యూహాం రచించడాన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.