
వామ్మో.. ఒక్క పామును చూస్తే హడలి పోతాం. ఒకే ప్రాంతంలో 30 పాములు.. అవి కూడా డేంజరస్ ర్యాటిల్ స్నేక్స్. ఇంకేమన్నా ఉందా? వాటిని చూడగానే వణుకు పుట్టేస్తది. ఆ పాములను చూసిన వాళ్లకు కూడా అదే జరిగింది. ఈ ఘటన టెక్సాస్‌లో చోటు చేసుకున్నది. ఓ ఇంట్లోని పాత షెడ్‌లోని ఓ క్యాబిన్ కింద ఈ ర్యాటిల్ స్నేక్స్ తలదాచుకున్నాయి.
వాళ్లు ఆ క్యాబిన్‌ను పైకి లేపేసరికి దాని కింద హాయిగా నిద్రపోతున్న 30 దాకా ర్యాటిల్ స్నేక్స్ కనిపించాయి. ఒక చిన్న ర్యాటిల్ స్నేక్ కనిపిస్తే.. దాని తల్లి ఏమన్నా అక్కడ ఉందేమో అని ఆ క్యాబిన్‌ను ఓపెన్ చేశారట. వాటిని చూసి భయపడిపోయి వెంటనే ఆ క్యాబిన్‌ను అలాగే కింద పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.