షర్మిలపై స్పీకర్‌కు టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

-

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులపై షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సభాపతి చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని సభాపతి హామీ ఇచ్చారు. షర్మిలపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు. దీనిపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. కాగా.. ఇప్పటికే షర్మిలపై మంత్రి నిరంజన్‌రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version