యాచిస్తూ వచ్చిన సొమ్మును విరాళం ఇస్తున్న బిచ్చగాడు.. ఇప్పటికి రూ.50 లక్షలు పైనే..!!

-

మనకు ఉన్నదాంట్లో చేసే తోచినంత సాయం..ఎదుటివారికి కొండంత మేలు చేస్తుంది. మనం మహా అయితే అన్నదానం చేయగలం.. అంతకంటే పెద్ద పెద్ద దానాలు చేయాలంటే సంపన్నులై ఉండాలి అనుకుంటాం. కానీ ఓ భిక్షగాడు యాచిస్తూ వచ్చిన సొమ్మును దానం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. యాచకుడు ఏం దానం చేస్తాడులే అనుకుంటారేమో..పది, వేలు కాదు.. లక్షల సొమ్మును సీఎంఆర్‌ఎఫ్‌కు పంపుతున్నాడట.. కొంచెం ఆసక్తిగానే ఉంది కదా..! ఇంతకీ ఎవరా భిక్షగాడు.. ఎంటా కథ మీరు ఓ లుక్కేయండి.!!

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని అలంకినారు గ్రామానికి చెందిన 72 ఏళ్ళ పూల్‌పాండి యాచిస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల వేలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చాడు. తన వద్ద ఉన్న 10 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌కు ఆ సొమ్మును అందజేశాడు.

పుష్కరకాలంగా భిక్షాటన చేస్తూ వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఇలా రూ. 50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేశాడట. ఒక బ్యాగ్‌.. అందులో టవల్, కావి ధోతి, టంబ్లర్, ప్లేట్‌తోనే పాండియన్ జీవితం గడిచిపోతుంది.

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పాండియన్ భిక్షాటన చేసి సంపాదించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు. పాండియన్ తన సంపాదనను తూత్తుకుడి, తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి చాలా సంవత్సరాలుగా విరాళంగా ఇస్తూ వస్తున్నారు.

మొత్తానకి ఓ భిక్షగాడు..ఇలా లక్షలు లక్షలు విరాళం ఇస్తు మానవత్వంలో ధనవంతుడయ్యాడు. సాయం చేయడానికి ఆస్తి, అంతస్తుతో పనిలేదు. మనకు ఉన్నదాంట్లోనే ఎదుటివ్యక్తికి ఉపయోగపడేలా ఎంతోకొంత ఇస్తే చాలు. మనం బయటకు వెళ్లినప్పుడు ఎంతోమంది అడుక్కుంటూ కనిపిస్తారు.. అలాంటివారికి కనీసం ఒక్కరికైనా.. కడుపునిండా టిఫెన్‌ పెట్టించండి చాలు.. వాళ్లు కళ్లలో వచ్చే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా సరిపోదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version