తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో… టిఆర్ఎస్ పార్టీ కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మునిసిపాలిటీ లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ లో ముగ్గురు అధికార తెరాస పార్టీ కి చెందిన కౌన్సిలర్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. పార్టీ లో చేరిన వారికి బిజేపి కండువా కప్పి స్వాగతం పలికారు.
కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి – 3 వార్డు, దివిటి కనకయ్య – 7 వ వార్డు, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ – 8 వ వార్డు నుంచి బీజేపీ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాక లో అభివృద్ధి కోసం కృషి చేస్తామని, తెరాస పార్టీ దుబ్బాక ను కావాలని టార్గెట్ చేయడం తగదని వారన్నారు. దుబ్బాక నే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తోందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక తోనే దానికి నాంది పడిందని బండి సంజయ్ అన్నారు.