దారుణం : యువకుడిని చంపి పూడ్చిన టీఆర్ఎస్ నేత..అందుకే !

-

హైదరాబాద్ లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అల్వాల్ కు చెందిన కనకరాజు అనే టిఆర్ఎస్ నేత దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే అల్వాల్ అంజయ్య నగర్ కు చెందిన టిఆర్ఎస్ నేత కనక రాజు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే అదే అమ్మాయితో శ్రీకాంత్ రెడ్డి అనే మరో యువకుడు అక్రమ సంబంధం పెట్టుకుని ఆ యువతిని తీసుకుని ఆరు నెలల క్రితం పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కనక రాజు ఆరు నెలల పాటు గాలించి శోధించి ఇద్దర్ని తీసుకువచ్చాడు.

వారిని నగర శివారు లోని జవహర్ నగర్ లోని ఒక ఇంట్లో బంధించాడు. ఈ రోజు మద్యం తాగుతూ ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టినట్లు గుర్తించారు. ఐదు రోజుల క్రితం ఆ యువకుడిని కొట్టి చంపి అల్వాల్ లోని స్మశానానికి తీసుకు వెళ్లి పాతి పెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని మద్యం మత్తులో తన స్నేహితులతో పెంచుకున్నాడు కనుక రాజు. వారు భయపడి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు పాతి పెట్టిన చోట ప్రస్తుతానికి తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ అ శవం దొరక గానే పోస్టుమార్టం నిర్వహించి తగిన చర్యలు తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version