తెలంగాణలో కేసీఆర్..ఇజం..కేటీఆర్ ఇజం నడుస్తుందన్నారు టిఆర్ఎస్ ఎమ్యెల్యే అరూరి రమేష్. రేవంత్ రెడ్డి కామెంట్స్ కౌంటర్ ఇచ్చిన అరూరి రమేష్.. మీడియా తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రైతుల ఆత్మహత్యలు అన్నారు. రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వమేనని…కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఉద్యమ నేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదు.
రేవంత్ రెడ్డి కి లేదన్నారు. కరెంటు కోసం ధర్నా చేసిన రైతులను కాల్చిన చంపిన పార్టీలో ఉన్న నీవు.. రైతుల కోసం సభలు పెడుతాము అనడం హాస్యాస్పదంగా ఉంది… యాత్రలు చేయటం, సభలు పెట్టిన ..కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని విమర్శించారు.
మంత్రి కేటీఆర్ పేరు వింటే… ప్రతిపక్షాలకు వణుకు మొదలైందని.. టీఆరెస్ పార్టీ కి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేత లు జైలు కి ఎందుకు పోయారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చం దుకు జైలు కి వెళ్ళాము..నువ్వు జైలు కి ఎందుకు పోయావు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి క్రమమం లో అడ్డంగా దొరికి పోయి జైల్ కి వెల్లవన్నారు.