కేసీఆర్ కు షాక్ : ఈట‌ల రాజేంద‌ర్ ను ఆలింగనం చేసుకున్న టీఆర్ఎస్ ఎంపీ కేకే

-

ఇటీవ‌ల టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట కు వ‌చ్చి.. హుజురాబాద్ నియోజక వ‌ర్గం లో టీఆర్ఎస్ పై గెలిచిన ఈటల రాజేంద‌ర్ ను టీఆర్ఎస్ పార్టీ రాజ్య స‌భ ఎంపీ ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామం తో చుట్టు ఉన్న వారంత షాక్ కు గురి అయ్యారు. ఈ రోజు హైద‌రాబాద్ లో జ‌రిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కుమారిడి పెళ్లి వేడుక ఈ షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధ‌ర్ హాజ‌రు అయ్యారు.

అలాగే టీఆర్ఎస్ నుంచి రాజ్య స‌భ ఎంపీ కే కేశవ‌రావు కూడా హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఇద్ద‌రు ఒక‌రిని ఒక‌రు ఎదురు అయిన వెంట‌నే టీఆర్ఎస్ ఎంపీ కే కేశ‌వ రావు ఈటల రాజేంద‌ర్ ను ప‌ల‌కరించారు. అలాగే ఆలింగ‌నం కూడా చేసుకున్నారు. దీంతో వారి చుట్టు ప‌క్క‌ల ఉన్న వారంతా ఆశ్చ‌ర్యానికి గురి అయ్యారు. కాగ ఈ ఘ‌ట‌న‌ ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రం లో చ‌ర్చినీయ అంశం గా మారి పోయింది. అంతే కాకుండా రాజకీయం గా ప‌లు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version