మహిళలకి నిజంగా నెలసరి మూడు రోజుల్లో ఎంతో కష్టంగా ఉంటుంది. కడుపునొప్పి, తలనొప్పి, వికారం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. నెలసరి సమయంలో మహిళలు వీటిని తీసుకుంటే సమస్యలన్నిటికీ దూరంగా ఉండొచ్చు.
సాల్మన్:
సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలానే ఈ చేపల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. క్రామ్ప్స్ వంటి వాటి నుంచి రిలీఫ్ ని ఇస్తుంది. కాబట్టి మహిళలు పీరియడ్స్ సమయంలో సాల్మన్ తీసుకోవడం మంచిది.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ కూడా పీరియడ్స్ సమయంలో మహిళలకు మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కడుపునొప్పి వంటి సమస్యల నుండి కూడా ఇది బయటపడేస్తుంది.
ఓట్ మీల్:
ఓట్ మీల్ లో క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఓట్ మీల్ లో ఐరన్ కూడా ఉంటుంది. స్టమక్ అప్సెట్ లాంటి సమస్యల నుండి కూడా ఇది బయట పడేస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో మహిళలు దీన్ని కూడా తీసుకోవడం మంచిది.
పుచ్చకాయ:
పుచ్చకాయ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది హైడ్రేట్ గా ఉంచుతుంది. బ్లోటింగ్ మొదలైన సమస్యలని కూడా ఇది దూరం చేస్తుంది.
గుడ్లు:
గుడ్లలో విటమిన్ డి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మొదలైనవి ఉంటాయి. అయితే ఈ సమయంలో గుడ్లు తీసుకుంటే బ్లోటింగ్, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. చూశారు కదా ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు అనేది. కాబట్టి మహిళలు వీటిని తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.